జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండగట్టుకు వెళ్లేదారిలో ఓ కెనాల్ లో క్వాలిస్ వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో అందులో ప్రయాణిస్తున్న 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన శివరాత్రి సురేష్,.. అతని కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం వేములవాడ దర్శనానికి వెళ్ళాడు. మంగళవారం వేములవాడ నుండి కొండగట్టు అంజన దర్శనానికి వెళుతున్న క్రమంలో జేఎన్టీయూ సమీపంలో క్వాలిస్ బ్రేకులు ఫెయిల్ కావడంతో కినాల్ లో పడిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులకు ఐదుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు హుటాహుటిన జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
