జనగాం :
రఘునాథపల్లి మండలం మండెలగూడెం లో లేగ దూడ పై పెద్దపులి దాడి చేసింది. రాజు అనే రైతుకు సంబంధించిన లేగ దూడను చంపింది. పులి అడుగులను పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు. సమీప గ్రామాలను అలర్ట్ చేసిన అధికారులు. గత కొన్ని రోజులుగా జనగామ జిల్లా వాసులను పులి కలవరపెడుతుంది. అయితే దీని ఆనవాళుగా పాదముద్రలు.. అక్కడక్కడ లేగ దూడలను, జంతువులను చంపడం పులి సంచరిస్తునేందుకు రుజువులుగా మారుతున్నాయి. డ్రోన్ ల సాయంతో పులిని ట్రాక్ చేసే పనిలో అధికారులు పడ్డారు. దాని కోసం వెతుకులాట మొదైలంది.

