తొర్రూరు :
మున్సిపల్ కార్యాలయంలో ఓటింగ్ జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ఎర్రబెల్లి పీఏపై దాడి చేసినట్టు సమాచారం.
ఈ ఘటనపై స్పందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, ఝాన్సీ రెడ్డిని లోనికి అనుమతించి తనను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. అమెరికా పౌరసత్వం ఉన్న ఝాన్సీకి సమావేశంలో పాల్గొనే అర్హత ఏంటని సందేహం వ్యక్తం చేశారు.
చైర్మన్ ఎన్నికల సందర్భంగా పార్టీ సభ్యులకు విప్ జారీ చేయాల్సి ఉండటంతో, సంబంధిత పత్రాలను ఆర్డీవోకు అందజేయడానికి తాను అక్కడికి వెళ్లానని తెలిపారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు తనపై ఎలాంటి కారణం లేకుండా దాడికి పాల్పడ్డారని ఎర్రబెల్లి ఆరోపించారు.

