ఇసుక అక్రమ రవాణా చేయం..

జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని దాదాసాహెబ్ కాలనీ పరిధిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. కాలనీలోని వాగు నుంచి కొంతమంది వాసులు అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించిన ఎస్సై ఊర సృజన్ కుమార్ స్వయంగా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమై అక్రమ ఇసుక రవాణా వల్ల కలిగే నష్టాలను వివరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం దాదాసాహెబ్ కాలనీ వాసులందరితో ప్రతిజ్ఞ చేయించారు.

ప్రతిజ్ఞలో భాగంగా వాసులు “ఇప్పటినుంచి అక్రమ ఇసుక రవాణా చేయము, ఎవరైనా చేస్తే పోలీసులకు సమాచారం అందిస్తాము, సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఇసుక తరలింపు జరపము. నిబంధనలు ఉల్లంఘిస్తే మాపై కఠిన చర్యలు తీసుకోవచ్చు” అని స్పష్టం చేశారు.

ఎస్సై సృజన్ కుమార్ ఈ చర్యలతో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *