మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ

మధ్యాహ్నం 2:45 గంటలకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. శ్రీకాకుళంలో ప్రారంభమైన 40 ఏళ్ల మావోయిస్ట్ ఉద్యమ చరిత్ర నేడు ICCC వేదికగా ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా నలుగురు కీలక మావోయిస్ట్ అగ్రనేతలు డీజీపీ సమక్షంలో లొంగుబాటు కానున్నారు.

లొంగుబాటు కానున్న నేతలు:

  • దేవుజి అలియాస్ తిప్పిరీ తిరుపతి (ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ)
  • మల్లా రాజిరెడ్డి
  • బడే చొక్కారావు అలియాస్ దామోదర్
  • నున్నే నరసింహ రెడ్డి

ఇక మావోయిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు సమాచారం. మావోయిస్ట్‌లపై చర్యల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం (SIB) కీలక పాత్ర పోషించింది. SIB ఏర్పాటుకు తరువాత అనేక ఆపరేషన్లు నిర్వహించి, సోర్స్ బిల్డింగ్ మరియు ఇంటెలిజెన్స్ సేకరణలో ప్రత్యేక నైపుణ్యం చూపింది.

చర్యల వివరాలు:

  • 14,078 మంది మావోయిస్టులు అరెస్ట్
  • 5,865 మంది లొంగుబాటు
  • 1,289 మంది ఎన్‌కౌంటర్‌లో మృతి
  • 1,057 ఎన్‌కౌంటర్ ఘటనలు నమోదు

కేంద్ర కమిటీ సభ్యులపై చర్యలు:

  • 23 మంది సమాచార సేకరణలో గుర్తింపు
  • 7 మంది అరెస్ట్
  • 7 మంది లొంగుబాటు
  • 9 మంది ఎన్‌కౌంటర్‌లో మృతి

మొత్తం 21,232 మంది మావోయిస్టులపై చర్యల్లో తెలంగాణ SIB కీలక పాత్ర పోషించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *