కరీంనగర్ :
డీపీఆర్వో కార్యాలయంలో అంతా తానై నడిపిస్తూ.. అన్నింట్లో తానే ఉన్నాననే భావంతో ఎవరిని లెక్కచేయకుండా.. అందరి ఫొటోలు తానే తీస్తాననే అతినమ్మకంతో రెచ్చి పోతాడు. కానీ ఈయన మాత్రం తప్పుడు సర్టిఫికెట్లత ఉద్యోగం వెలబపెడుతున్నాడు. కరీంనగర్ డీపీఆర్వో పోటో గ్రాఫర్ పై ఎంఆర్పీఎస్ నాయకులు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డీపీఆర్వో ఆఫీసులో ఫొటో గ్రాఫర్‌గా చేస్తున్న ఉప్పు దామోదర్ అక్రమ మార్గంలో ఉద్యోగంలో చేరాడని ఆరోపించారు. గత ప్రభుత్వంలో కొంత మంది అండదండలతో ఓ యూనివర్సిటీ నుంచి ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి తాత్కాలికంగా ఉద్యోగిగా శాఖలో చేరినట్లు తెలిసింది. గతంలో పలుమార్లు ఫిర్యాదులు అందిన కలెక్టర్ దగ్గరి సిబ్బంది అప్పటి కలెక్టర్‌ను తప్పుదారి పట్టించి ఫిర్యాదును చెత్తబుట్టలో వేశారు. దీంతో గత కొద్ది సంవత్సరాలుగా ఉద్యోగంలో కోనసాగుతున్నాడు. ఇప్పటికైనా ఫొటో గ్రాఫర్ సర్టిఫికెట్ల పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు గాలిపెల్లి శ్రీనివాస్ కోరారు. ఎంఆర్పీఎస్ నాయకుడి ఫిర్యాదుతో స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు తెలిస్తుంది.
