మెదక్
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గంగయ్యపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలం యాదవ్ (40) వ్యవసాయ పొలం వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోహరాబాద్ మండలం పోతారం సర్పంచ్ వినోద భర్త మహేందర్ దగ్గర చిట్టి వేశాడు. రూ.50 వేల చిట్టి డబ్బులు నాలుగు నెలల నుండి ఇవ్వడం లేదని మనస్థాపం చెంది సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
చిట్టి అయిపోయి నాలుగు నెలలు అవుతున్న రూ.50 వేలు మహేందర్ ఇవ్వడం లేదు. నా ఆరోగ్యం బాగాలేదు. చిట్టి డబ్బులు ఇవ్వమని ఇంటికి వెళ్లి ప్రాధేయపడ్డ కనికరించకుండా నాలుగు నెలల నుండి ఇబ్బందికి గురి చేస్తున్నాడు. అందుకే జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాశాడు.
గ్రామస్తులు అందరూ కలిసి పోతారం వెళ్లి మహేందర్ ఇంటి ముట్టడించారు.
బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని మహేందర్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.
