ఎమ్మార్వో ఇంటిపై ఏసీబీ దాడులు

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ శ్రవణ్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. కరీంనగర్ లోని మహారాజా బార్ వెనకాల ఉన్న ఒక ఇంట్లో, ఆర్టీసీ కాలనీలో మరో ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్ గా పని చేసిన సమయంలోనూ బొమ్మకల్ భూముల విషయంలో పెద్ద ఎత్తున జరిగిన అక్రమాల్లో శ్రవణ్ పాత్ర కీలకమనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ దాడులతో మొత్తం అక్రమ సంపాదన చిట్టా బయటకు వస్తుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *