నాగపూర్ :
Indian Council of Agricultural Research(ఐకార్) కు చెందిన శాస్త్రవేత్తలు నాగ్‌పూర్‌లో సహజంగానే రంగులతో పెరిగే కొత్త పత్తి రకాలను అభివృద్ధి చేశారు. ఈ పత్తి మొక్కలు సహజంగా గోధుమ , పచ్చ రంగుల్లో పండే విధంగా రూపొందించారు.
వస్త్ర పరిశ్రమలో ఉపయోగించే రసాయన రంగుల అవసరాన్ని తగ్గించడమే ఈ కొత్త రకం పత్తి లక్ష్యం. సాధారణంగా వస్త్రాలకు రంగు ఇవ్వడానికి డైయింగ్ ప్రక్రియలో భారీగా నీరు , రసాయనాలు ఉపయోగిస్తారు.
కానీ ఈ సహజ రంగుల పత్తి వాడితే డైయింగ్ ప్రక్రియ చాలా వరకు తగ్గుతుంది. దీంతో వేల లీటర్ల నీరు ఆదా అవుతుంది. అలాగే ప్రమాదకర రసాయన వ్యర్థాలు నదుల్లోకి వెళ్లకుండా పర్యావరణాన్ని కాపాడటానికి కూడా ఇది ఉపయోగపడనుంది. శాస్త్రవేత్తల ప్రకారం భవిష్యత్తులో వస్త్ర పరిశ్రమలో ఈ సహజ రంగుల పత్తి పెద్ద మార్పు తీసుకురావొచ్చని భావిస్తున్నారు.
