మహబూబాబాద్ :
పెళ్లి విషయంలో ప్రేమజంట వాగ్వాదం చేసుకున్నారు. తన మాట నెగ్గలేదని ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన పెయింటర్ వల్లపునేని శశికుమార్ (21), కేసముద్రం శివారు తండాలోని ఇంటర్ యువతి (20) ఒకరినొకరు ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు.శశికుమార్ యువతికి ఫోన్ చేసి ఇద్దరం ఈ రోజే పెళ్లి చేసుకుందామని పట్టుబట్టాడు. ఇంటర్ పరీక్షలు అవుతున్నాయి.. అవి పూర్తయ్యాక చేసుకుందాం అని యువతి సర్దిచెప్పింది. ఈ విషయంలో ఇద్దరి నడుమగొడవ జరిగింది.ప్రియురాలు తన మాట వినకపోవడంతో మనస్థాపానికి గురై కురవిలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
