భూపాలపల్లి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిఏ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిట్యాల మండలానికి చెందిన ఓ దళిత యువతిని పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని బాధితురాలు పిర్యాదు చేసింది. మరో అమ్మాయి ఎస్ ఐ తో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. ఎంగేజ్ మెంట్ జరుగుతున్న క్రమంలో ఆ బాధిత యువతి వచ్చి అడ్డుకుంది. దీంతో ఆ ఎంగెజ్ మెంట్ కార్యక్రమం కూడా నిలిచిపోయింది. ఈ నెల 7న జరగాల్సిన పెళ్లి కూడా ఆగిపోయింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
