చేయని నేరం మోపిండ్రని సూసైడ్

చేయని నేరం మోపిండ్రని కలత చెంది యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కాకతీయ యూనివర్సిటీలో కలకలం రేపుతుంది. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. క్యాంపస్ లోని పద్మావతి హాస్టల్ బీ బ్లాక్ లో శ్రీ విద్యపై దొంగతనం ఆరోపణలు మోపి కొట్టారనే మనస్తాపంతో ఆత్మహత్య కు పాల్పడింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చనిపోయే ముందు ఆమె మరణ వాంగ్మూలం ఇచ్చింది. తాను ఆత్మహత్య చేసునేందుకు కారణమైన ఆరుగురు విద్యార్థుల పేర్లు చెప్పింది. మరణ వాంగ్మూలం ఆధారంగా కేయూ పోలీసులు విచారణ జరుపుతున్నరు. శ్రీవిద్యది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *