ఏసీబీ వలలో ఎక్సైజ్ సీఐ

కామారెడ్డి జిల్లా బిచ్కుందలో విధులు నిర్వహిస్తున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ దీను సత్యనారాయణను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుని నుంచి రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తాటి కళ్ల దుకాణాలను గ్రామాల నుంచి మార్చాలని ఒత్తిడి చేయకుండా ఉండడం, కొత్త కేసులు నమోదు చేయకుండా అనుకూలంగా వ్యవహరించడం కోసం ఈ లంచం తీసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. అదనంగా ఆయన బ్యాగ్‌లో లెక్కల్లో చూపని రూ.45,760 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందిత అధికారిని అరెస్టు చేసి నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *