ఆ మండలాల ప్రజలు బీ అలర్ట్

రఘునాథపల్లి మండలంలో పులి తిరుగుతున్నట్లు జనగామ జిల్లా అటవీ శాఖ అధికారి లావణ్య తెలిపారు. చుట్టూ ప్రక్కన మండలము లో గల ప్రజలు… లింగాల ఘనపురం, రఘునాథపల్లి, నర్మెట్ట, జనగాం, దేవరుప్పుల , తరిగొప్పుల మొదలగు మండలాలలోని ప్రజలు అప్రమత్తముగా ఉండాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితులలో తప్ప మిగితా సమయములో బయటికి రాకూడదు. ఒకవేళ అత్యవసరమైన పని ఉన్నచో గుంపు గుంపులుగా వెళ్లవలెను. రాత్రి సమయములో బయట తిరగకూడదు. రైతులు బావుల వద్ద ఉచ్చులను, కరెంటు వైర్లు అమర్చకూడదు. పశువులను ఇంటివద్దనే సంరక్షించుకోవాలి.
ఏదయినా పులి సంచార సమాచారము తెలిసినచో ఫారెస్ట్ వారిని గాని పోలీస్ వారిని సంప్రదించాలని.. వారు నిర్దారించిన తర్వాతనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని అధికారి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *