కారు పల్టీ కొట్టి ఇద్దరి మృతి

నిజామాబాద్ జిల్లా నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే దుర్మరణం చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నగర శివారులోని బై పాస్ రోడ్ ఫై ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో చింతల శ్రీనివాస్ నడిపే ఇటుకల బట్టిలో నాందేడ్ కు చెందిన కూలీలు పనిచేస్తారు. హోలీ పండగ కోసం నాందేడ్ వెళ్లి మారుతీ టాక్సీ కార్ లో రిటర్న్ వెళుతున్నారు. వాహనాన్ని డ్రైవర్ స్పీడ్ గా నడుపడంతో అదుపుతప్పి కల్వర్ట్ వద్ద మూడు పాల్టీలు కొట్టింది. కార్ లో ఉన్న ఇద్దరు మృతి చెందగా గాయాలకు గురైన నలుగురిని జీజీహెచ్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఘటన స్థలాన్ని సీపీ సాయి చైతన్య సందర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *