కరీంనగర్ :
కరీంనగర్ లో అర్బన్ ఎక్సైజ్ సీఐగా పని చేస్తున్న రామును ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. గతంలో సిరిసిల్ల ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో అవినీతికి పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓబులాపూర్ గ్రామంలో ఎస్జీటీ గా పని చేసే తన ఫ్రెండ్ జక్కని వేణు ద్వారా ఫోన్ పే, ఆన్ లైన్ లావాదేవీలు జరిపాడు. వీటికి సంబంధించిన ఆధారాలు ఏసీబీ అధికారులకు లభించడంతో సీఐ రామును అరెస్ట్ చేశారు. సీఐతో పాటు టీచర్ ను కూడా అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇంట్లో సోదాలు చేస్తే రూ. 20 లక్షల నగదు దోరికింది. వీరిద్దరిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు.
