కొబ్బరిబోండం కొంటున్నారా..?

వేసవిలో ఆరోగ్యాన్నిచ్చే కొబ్బరి బొండాలను కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అనుభవజ్ఞులైన వ్యాపారులు సూచిస్తున్నారు. మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఉండి, గుండ్రంగా ఉన్న బొండాలను ఎంచుకోవాలి. బొండాన్ని ఊపినప్పుడు లోపల శబ్దం రాకూడదు; శబ్దం వస్తే నీరు తక్కువగా ఉన్నట్లు అర్థం. అలాగే బొండం పైన కొద్దిగా నల్లగా, ఎండినట్లు ఉంటే అందులో నీరు సమృద్ధిగా ఉంటుందని వివరిస్తున్నారు. ఈ చిన్న చిట్కాలతో నిండుగా నీరున్న బొండాలను సులభంగా గుర్తించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *