ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం

వరంగల్ నగరంలోని జేపీఎన్ రోడ్డుపై ఉన్న దత్తాత్రేయ ఫర్నిచర్ షాపులో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికి ఆహుతైన ఫర్నిచర్ సామగ్రి కారణంగా భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. స్థానికులు గమనించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. షాపులో ఉన్న సోఫాలు, కట్టెల ఫర్నిచర్, ప్లైవుడ్ సామగ్రి దగ్ధమైనట్లు తెలుస్తుంది. అగ్నిప్రమాదం కారణంగా లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *