5గురు విలేకరుల అరెస్టు

బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు విలేకరులను అరెస్ట్ చేసినట్లు సీఐ డి. గురుస్వామి వెల్లడించారు. బాధితుడిని బెదిరించి రూ.2 లక్షలు వసూలు చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఫిర్యాదుదారు బైరి వెంకటస్వామి (ధన్నూర్ బి గ్రామం) ని 2023లో కొందరు పత్రికా విలేకరులు తనను సంప్రదించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక మహిళతో అక్రమ సంబంధం ఉందని వార్తాపత్రికల్లో ప్రచురిస్తామని, తన పరువు తీస్తామని, ఆత్మహత్య చేసుకునేలా చేస్తామని బెదిరించారు. భయంతో 25-07-2023న నిందితులకు రూ.2 లక్షలు ఇచ్చినట్లు బాధితుడు తెలిపారు. ఇతరుల ఫిర్యాదుల నేపథ్యంలో నిందితులపై కేసులు నమోదవడంతో ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

నిందితుల వివరాలు.. భీమ ప్రవీణ్ (42), కనుగుట్ట, బోథ్ ,గడ్డం అజయ్ కుమార్ (35), తేజాపూర్, నేరడిగొండ, బూస రాము @ అంజన రాము (48), బోథ్, మంచికుంట సతీష్ (32), బోథ్, బద్దం దినేష్ రెడ్డి (32), ధన్నూర్ బి, బోథ్. ఈ ఘటనపై ఎస్సై వి. పురుషోత్తం ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి, ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *