వరంగల్ బడ్జెట్ ఎంతో తెలుసా..?

వరంగల్ మహానగర పాలక సంస్థ 2026-2027 కి రూ.1040 కోట్ల 58 లక్షల 75 వేల అంచనాలతో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం పాలక వర్గం ఆమోదించింది. బల్దియా అకౌంట్స్ అధికారి శివలింగం బడ్జెట్ అంచనాలను వెల్లడించగా మెజారిటి సభ్యులు అంగీకారం తెలపడంతో పాలకవర్గం బడ్జెట్ ను ఆమోదించింది. ఇందులో రూ.349 కోట్ల 19 లక్షలు సాధారణ పన్నుల ద్వారా, రూ.685 కోట్ల 20 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా, రూ 620 కోట్లు డీపాజిట్లు, అడ్వాన్సుల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు. హన్మకొండ జిల్లా కలెక్టర్, జిడబ్ల్యూఎంసి ఇంచార్జి కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, డెప్యుటీ మేయర్ రిజ్వాన శమిమ్ మసూద్, కార్పొరేటర్లు, బల్దియా వింగ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *