తొర్రూరులో ఉద్రిక్తత

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు విషయంలో మాజీమంత్రి ఎర్రబెల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము 9 మంది కౌన్సిలర్లను గెలిపించుకున్నామని, కాంగ్రెస్ అక్రమంగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోందని ఎర్రబెల్లి ఆరోపించారు. ఇరుపార్టీల నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సుమారు 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ 200 మీటర్ల పరిధిలో Section 144 అమలు చేశారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో పరిస్థితులను అదుపులో ఉంచేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *