బాసర :
బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ ఫస్టియర్ ఈ1 (ఈసీఈ) చదువుతున్న స్టూడెంట్ బుధవారం తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుంది. తోటి విద్యార్థుల సమాచారంతో యూనివర్సిటీ అధికారులు ఆమెను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. వనపర్తి జిల్లాకు చెందిన ఈ స్టూడెంట్ సూసైడ్ గల కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
గత కొద్ది రోజుల నుంచి ఆర్జీయూకేటీలో ఆత్మహత్యలు ఆగిపోయాయి. కొత్త వీసీ వచ్చిన తరవాత విద్యార్థుల సమస్యలు నిత్యం తెలుసుకోవడం.. వారి సమస్యలుంటే వెంటనే పరిష్కారం చేయడం జరిగింది. చాలా రోజుల తరవాత జరిగిన ఈ సూసైడ్ తో మళ్లీ యూనవర్సిటీలో కలకలం రేగింది.

