మూడో అంతస్తు నుంచి కూలిన లిఫ్ట్

భూపాలపల్లి జిల్లా ప్రజాపాలన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమం కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులు లిఫ్ట్‌లో వెళ్తున్నారు. అకస్మాత్తుగా లిఫ్ట్ కేబుల్ తెగిపోవడంతో మూడో అంతస్తు నుంచి కిందపడింది. ఈ ఘటనలో లిఫ్ట్‌లో ఉన్న ఆరుగురు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన భూపాలపల్లి వంద పడకల ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *