కరీంనగర్ :
చొప్పదండి మండలం చాకుంట ఎక్స్ రోడ్డులో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను లారీ వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన తాటికొండ సాయికిరణ్(23), చిలుక ప్రదీప్(23) ఇద్దరు చాకుంటలో జరుగుతున్న వివాహానికి వారి రుక్మాపూర్ గ్రామం నుంచి బైక్ పై వెళ్లుతున్నారు. అతివేగంగా వచ్చిన లారీ వీరి బైక్ ను వెనకాల నుంచి ఢీకొట్టి ఇద్దరి తలల నుంచి టైర్లు ఎక్కడంతో మెదడు బయటకు చిట్లి స్పాట్లోనే చనిపోయారు. యాక్సిడెంట్ సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకొని వివరాలు సేకరించారు. వివాహానికి బయలు దేరిన ఐదు నిమిషాలలోపే ఇద్దరు ఫ్రెండ్స్ లారీ యాక్సిడెంట్లో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
