జగిత్యాల :
జగిత్యాల మున్సిపాలిటీపై ఎమ్మెల్యే సంజయ్ భ్రష్టు పట్టించారని, జగిత్యాల మున్సిపాలిటీని అవినీతికి కేంద్రంగా మార్చారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ,ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఏసీబీ దాడులు, విజిలెన్స్ విచారణలే అభివృద్ధికి నిదర్శనమన్నారు. ఛైర్ పర్సన్ సీటు ఖాళీ అయినప్పుడు చట్టంలో లొసుగులు ఉపయోగించి బలహీన వర్గాల హక్కులు కాజేశారని ఆరోపించారు. రెండేళ్లుగా ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎందుకు వినియోగంలోకి రాలేదని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు.

