జనగామ బ్రిడ్జి మీద రోడ్డు ప్రమాదం

జనగామ :

జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో స్పాట్లోనే ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన లింగాల బోయిన నవీన్ (24) జనగామ పట్టణ సమీపంలోని శామీర్ పేటకు చెందిన పిడుగు అభిలాష్ సిద్ధిపేట రోడ్డు నుంచి బైక్ పై నెహ్రూ పార్క్ కు వస్తుండగా.. జనగామ బ్రిడ్జిపై నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే నవీన్ మృతి చెందగా.. అభిలాష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని అభిలాష్ ను ఎంజీఎంకు తరలించారు. నవీన్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. నవీన్ చంపక్ హిల్స్ ప్రభుత్వ ఆసుపత్రి లో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. యువకుడి మృతితో ఇప్పగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Screenshot

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *