మేడారం వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 28, 29వ తేదీల్లో 28 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ టు మంచిర్యాల్, మంచిర్యాల్ టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ టు సికింద్రాబాద్, నిజామాబాద్ టు వరంగల్, వరంగల్ టు నిజామాబాద్, కాజిపేట్ టు ఖమ్మం, ఖమ్మం టూ కాజీపేట, ఆదిలాబాద్ టు కాజీపేట, కాజీపేట టు ఆదిలాబాద్ రూట్లలో ఈ స్పెషల్ ట్రైన్స్ రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. అందుకే రైల్వే అధికారులు చెప్పినట్లు ఒకసారి టైమ్ టేబుల్ మీద లుక్ వేయండి.. మీకు నచ్చిన ట్రైన్ ఎక్కి అమ్మవార్ల దర్శనం చేసుకోండి.

