జగిత్యాల :
జగిత్యాల జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై పలుమార్లు శారీరక దాడికి పాల్పడిన వ్యక్తి వేధింపులలకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. వరుసకు చెల్లితో ప్రేమాయణం పేరుతో కోరిక తీర్చాలని మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఒత్తిడి తీసుకొచ్చి నిరంతరం వేధింపులకు గురి చేశాడు. బలవంతంగా శారీరక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటపెడితే తమ్ముడిని చంపేస్తానని బెదిరించడంతో భయాందోళనకు గురైన బాలిక, ఏమి చేయాలో అర్థంకాక వారం క్రితం సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి అత్మహత్య యత్నం చేసింది. హైదరాబాదులో చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందింది. ఘటనపై విచారం వ్యక్తం చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మైనర్ కుటుంబాన్ని పరామర్శించి, వేధింపులకు పాల్పడ్డ మనోజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరారు.
