జనగామ :
సైబర్ మోసగాళ్ల చేతిలో జనగామ ఎమ్మెల్యే మోసపోయాడు. కేంద్ర పథకం పేరుతో ఎమ్మెల్యేను మోసం చేశారు ఆ కేటుగాళ్లు. అపరిచిత ఫోన్ కాల్ ద్వారా తెలంగాణ ఆర్థికశాఖలో అదనపు కార్యదర్శి అనంత అంటూ పరిచయం చేసుకుని పల్లా రాజేశ్వర్ రెడ్డి నుంచి రూ. లక్ష కాజేశారు. “వికసిత్ భారత్” పథకం పేరుతో నిందితుడు నమ్మబలికాడు. అర్హుల జాబితా పంపిస్తే రూ.10 లక్షల రుణాలు అంటూ మోసం. ఒక్కొక్కరికి 2,500 చొప్పున 1లక్ష ప్రాసెసింగ్ ఫీజు వసూలు. ఫోన్ పే ద్వారా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డబ్బులు పంపారు. మళ్లీ డబ్బులు అడగడంతో మోసం బయటపడింది. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు పల్లా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
