జనగామ
పాలకుర్తి మండల ఎమ్మార్వో సరస్వతి తన కుమారుడిని, మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, జీతం తీసుకోవడమే కాదు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల పై ఉన్న అపోహ తొలగిపోతుందన్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయన్నారు.

