డిగ్రీ కాలేజీకి బంగారు పతకాలు

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల నగునూరు, కరీంనగర్ లోని విద్యార్థినులు ‘విజ్ఞానశాల’ నిర్వహించిన కల్పన షీ ఫర్ స్టెమ్ కార్యక్రమంలో ఆపూర్వ విజయాన్ని సాధించారు. కృష్ణవేణి , ఏ. అక్షయ షీ ఫర్ స్టెమ్ – ఇన్క్యుబేటర్ (ఫిబ్రవరి–సెప్టెంబర్ 2025) కార్యక్రమంలో బంగారు పతకాలు సాధించి, ప్రతిష్టాత్మకమైన అక్సిలరేటర్ దశకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా పాల్గొన్న వారిలో టాప్ 15–20శాతంలో చోటు దక్కించుకున్నారు.


ఏ. అక్షయ రూ.5వేల నగదు బహుమతితో కూడిన స్టెల్లర్ స్కాలర్‌షిప్ సిల్వర్ అవార్డును టీ-హబ్ హైదరాబాద్ లో అందుకున్నారు.
ఇంకా 23 మంది విద్యార్థినులు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
కెమిస్ట్రీ విభాగం అధ్యాపకురాలు కల్పన షీ ఫర్ స్టెమ్ కాలేజ్ ఇన్‌చార్జ్ డా. రాధిక కి ఆమె మార్గదర్శకత్వానికి గాను ప్రశంసా పత్రం అందజేశారు. ప్రిన్సిపాల్ డా. టి. మాలతి,వైస్ ప్రిన్సిపాల్ ఎస్. పద్మజ, డాక్టర్ వసుమతి విద్యార్థినులను, అధ్యాపకులను అభినందించారు.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *