తెలంగాణకు మరో డిస్కం

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న TGSPDCL, TGNPDCLలకు అదనంగా మూడో విద్యుత్ పంపిణీ సంస్థను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త సంస్థకు “తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGRPDCL)” అనే పేరు పెట్టింది. ఈ సంస్థను “రైతు డిస్కమ్” అని కూడా పిలుస్తారు.రైతు డిస్కమ్ ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ సరఫరా, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ వంటి తాగునీటి పథకాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు సేవలు, అలాగే మున్సిపల్ నీటి కనెక్షన్లకు విద్యుత్ పంపిణీ చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది. విద్యుత్ కొనుగోలు, అమ్మకం, దిగుమతి–ఎగుమతి, పంపిణీ వ్యవస్థ నిర్వహణ, బిల్లింగ్ , వసూళ్లు వంటి కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహించనుంది. రైతులకు విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *