సిరిసిల్ల :
తల్లి బంగారాన్ని అమ్మి ఇన్స్టాగ్రామ్ ప్రియుడికి ఖరీదైన బైక్ కొనిచ్చింది ఓ యువతి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన యువతికి ఇన్స్టాగ్రామ్ లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతనిది ఎల్లారెడ్డిపేట మండలం, రాచర్ల గొల్లపల్లికి గ్రామానికి చెందిన యువకుడు. ఆ ప్రియుడు తనకు ఖరీదైన బైక్ కొని ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.. ప్రియుడి కోరిక తీర్చడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇంట్లో ఉన్న తన తల్లి బంగారాన్ని అమ్మి ప్రియుడికి ఖరీదైన బైక్ కొనిచ్చింది సదరు యువతి. ఇంట్లో బంగారం లేదని ఆ తల్లి ఆలస్యంగా గుర్తించింది. వెంటనే ఎల్లారెడ్డిపేటలోని పోలీసులను ఆశ్రయించింది ఆ తల్లి. ప్రియుడి మోజులో పడి ఎంతటి ఘోరాలకైనా దిగజారుతున్నారు.
