కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామ సర్పంచి ఎడవెల్లి వనజపై మాజీ సర్పంచి కర్ర సత్య ప్రసన్న రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటి ముందు నుంచి కారు వెళ్లకుండ కావాలనే జెండా గద్దె నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాత జెండా గద్దె వేరే చోటులో ఉన్నా.. కావాలనే దాన్ని కూలగొట్టి అడ్డంగా నిర్మించారని సత్య ప్రసన్న ఆరోపించారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల కిందట సర్పంచి భర్త మాజీ ఎంపీటీసీ ఎడవెల్లి నరేందర్ రెడ్డి హనుమాన్ ఆలయాన్ని కూలగొట్టించి కావాలనే వెడల్పు చేశారని కూడా గతంలో ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ చేపట్టాలని ఎస్ ఐకి ఫిర్యాదు చేశారు.

