జగిత్యాల
పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తున్న టాటా ఏసీ బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులను తీసుకెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటో మల్లాపూర్‌లోని మోడల్ స్కూల్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో సుమారు 15 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని మల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

