50వేలకు శిశువు విక్రయం

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం లింగాసన్ పల్లి తండాకు చెందిన గర్భిణి మహిళ గత నెల 10వ తేదీన మెదక్ పట్టణంలోని ఎంసీహెచ్ లో ప్రసవించింది. మూడు రోజుల తరువాత ఆమెను డిశ్చార్జ్ చేయగా, తన స్వగ్రామమైన లింగాసన్ పల్లి తండాకు వెళ్లింది. ఈ నెల 4వ తేదీ నుంచి ఆమెకు పుట్టిన బాబు కనిపించకపోవడంతో స్థానికులకు అనుమానం కలిగింది. విచారణలో ఆ మహిళ , ఆమె భర్త కలిసి ఆ మగ శిశువును రూ.50 వేలకి గుర్తు తెలియని వ్యక్తికి అమ్మినట్లు తెలిసింది. ఈ విషయం సోమవారం ఐసీడీఎస్ అధికారులకు, పోలీసులకు తెలియగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *