కరీంనగర్ :
కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ గా పని చేస్తున్న చంద్రశేఖర్ జమ్మికుంట మండలంలోని సీతంపేట గ్రామంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గత ఐదు రోజుల క్రితం చంద్రశేఖర్ భార్య దివ్య కడుపునొప్పి భరించలేక కరీంనగర్ లో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆయన తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఐదో రోజు పిట్టకు పెట్టేందుకు వెళ్లి ఇంటికి వచ్చాక ఇంట్లో ఉరివేసుకుని ఎస్సై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కుటుంబ సభ్యులు, గ్రామస్తులను తీవ్రంగా కలచి వేసింది. దీంతో ఆయన ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.
