దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను తలకిందులుగా ఎగరేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. గణతంత్ర దినోత్సవం వంటి పవిత్ర సందర్భంలో జాతీయ జెండాను సరైన విధంగా ఎగరవేయకపోవడం దేశ గౌరవానికి విఘాతం కలిగించిందని పలువురు విమర్శిస్తున్నారు. రాజ్యాంగ విలువలు, దేశభక్తి ప్రతీక అయిన త్రివర్ణ పతాకానికి ఈ విధమైన అవమానం అంగీకరించరాదని రాజకీయ, సామాజిక వర్గాలు మండిపడుతున్నాయి.

