జనగామలో హై టెన్షన్..

జనగామ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని పేర్కొంటూ ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికను రేపటికి వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆర్డీవో గోపి రామ్‌ను కలిసి ఫిర్యాదు చేస్తూ ఎన్నిక వాయిదా వేయాలని పట్టుబట్టారు. అయితే ఆర్డీవో గోపి రామ్ స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి కోరం ఉన్నందున ఎన్నికను వాయిదా వేయలేమని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నిక ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.

అయినప్పటికీ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఇది లా అండ్ ఆర్డర్ సమస్య అని పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా ఎన్నిక వాయిదా వేయాలని కోరారు.

ఇక ఓట్లలో సమానత వస్తే చిట్టీల ద్వారా డ్రా తీసే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు మున్సిపల్ కార్యాలయం పరిసరాలు, కరెంట్ బీ గెస్ట్ హౌస్, పోస్టాఫీస్ ప్రాంతాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు భారీగా గుమిగూడడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
చైర్మన్ ఎన్నిక పోటీగా సాగనున్న నేపథ్యంలో పట్టణంలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *