కామారెడ్డి:
కామారెడ్డి పట్ణణ కేంద్రంలోని బాలసదనం నుంచి ఇద్దరు బాలికలు తెల్లవారుజామున మైనర్ బాలికలు పరారయ్యారు. ఇటీవల సదనం పరారీ గోడ కూలగొట్టి కొత్తది కడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడ సందులు ఉన్నాయి. దీంతో వాటి నుంచి చక్కగా దూరి పారిపోయారు. వాళ్లు బయటకు పోయినట్లు సీసీ కెమెరాల్లో కనిపిస్తుందని అక్కడి సూపరిండెంట్ సంగమేశ్వరి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.
అయితే కామారెడ్డిలో ఇటీవల మిస్సింగ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే గోసంగి కాలనీకి చెందిన ఇద్దరు పిల్లలు కూడా కనిపించకుండా పోయారు. వాళ్ల జాడ కూడా ఇంకా తెలియరాలేదు. దీనికి తోడు బాలసదనం మిస్సింగ్ సైతం కలకలం రేపుతుంది. పోలీసులకు సవాల్ గా మారింది.
