వరంగల్ :
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కలకలం. కార్పొరేటర్ శ్రీమన్నారాయణ అరెస్ట్ అయ్యాడు. ఆర్థిక లావాదేవీలు.. హత్యాయత్నంపై 2020లో కేసు నమోదైంది. గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్ అధికార పార్టీ కార్పోరేటర్ గా వ్యవహరిస్తున్న పోతుల శ్రీమన్నారాయణను హైదరాబాద్ సరూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీమన్నారాయణ వద్ద ఓ వ్యక్తి రూ. 35 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 7 పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చాడు. వడ్డీతో సహా మొత్తం చెల్లించినా.. మరింత డబ్బు ఇవ్వాలని సదరు వ్యక్తిని వేధించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతోపాటు ఆ వ్యక్తిపై ముసుగు వేసుకుని వచ్చి పేపర్ కట్టింగ్ కట్టర్లతో దాడి చేశారు. ఈ రెండు కేసుల్లోనే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

