వరంగల్‌లో విషాదం – మానసిక వేధింపులతో ప్రాణాలు తీసుకున్న అనిత
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ అనిత వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. నాలుగేళ్లుగా కొనసాగిన మానసిక వేధింపులే ఈ విషాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.
- వరంగల్ జిల్లా పర్వతగురి మండలం సీత్యతండాకు చెందిన మహిళా కానిస్టేబుల్ అనిత ఆత్మహత్య.
- అనిత వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తోంది.
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్ నాలుగేళ్లుగా పెళ్లి పేరుతో వేధింపులు.
- డ్యూటీలో ఉన్నప్పుడు వీడియో కాల్ చేయాలని, ఇతరులతో మాట్లాడవద్దని ఒత్తిడి.
- రాజేందర్ వైఖరి నచ్చక అనిత తల్లిదండ్రులు వివాహానికి నిరాకరణ.
- అనిత తన స్నేహితుడు జబ్బార్ లాల్‌తో సన్నిహితంగా ఉందని రాజేందర్ తప్పుడు ప్రచారం.
- జబ్బార్ లాల్ డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ వేధింపులు.
- తీవ్ర మనస్తాపంలో రాజేందర్‌కు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేసిన అనిత.
- “చస్తే చావు” అంటూ రాజేందర్ నిర్లక్ష్యంగా స్పందించినట్లు సమాచారం.
- గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన అనిత.
- రాజేందర్, జబ్బార్ లాల్ ఇద్దరిపై కేసు నమోదు.
- ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
- మానసిక వేధింపుల కోణంలో విచారణ కొనసాగుతోంది.

