jwalanews2026@gmail.com

jwalanews2026@gmail.com

ఎమ్మార్వో కొడుకు గవర్నమెంట్ స్కూళ్లో..

జనగామ పాలకుర్తి మండల ఎమ్మార్వో సరస్వతి తన కుమారుడిని, మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, జీతం తీసుకోవడమే కాదు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా…

యాక్సిడెంట్ లో యువ డాక్టర్ మృతి

doctor

హనుమకొండ వరంగల్ హంటర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న డాక్టర్ మమత (33)ను లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు ఫాదర్ ఆఫ్ కొలంబియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, 9 నెలల గర్భిణీగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తలకిందులుగా జాతీయ జెండా

దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను తలకిందులుగా ఎగరేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. గణతంత్ర దినోత్సవం వంటి పవిత్ర సందర్భంలో జాతీయ జెండాను సరైన విధంగా ఎగరవేయకపోవడం దేశ గౌరవానికి విఘాతం కలిగించిందని పలువురు విమర్శిస్తున్నారు. రాజ్యాంగ విలువలు, దేశభక్తి ప్రతీక అయిన త్రివర్ణ పతాకానికి ఈ…

సర్పంచిపై ఎస్ఐకి ఫిర్యాదు

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామ సర్పంచి ఎడవెల్లి వనజపై మాజీ సర్పంచి కర్ర సత్య ప్రసన్న రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటి ముందు నుంచి కారు వెళ్లకుండ కావాలనే జెండా గద్దె నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాత జెండా గద్దె వేరే చోటులో ఉన్నా.. కావాలనే…

ఐఏఎస్ కు ఘన సన్మానం

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 16 మంది అడిషనల్ కలెక్టర్లకు ‘ఐఏఎస్’ (IAS) హోదా కన్ఫర్మ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కరీంనగర్ జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గతంలో కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా పనిచేసి, ప్రస్తుతం మహాత్మా జ్యోతిబా ఫూలే విద్యాలయాల సంస్థ సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌కు ఐఏఎస్…

సాదాసీదాగా ఒక్కటయ్యారు..

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారిని శేషాద్రిని రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి ఎలాంటి అడంబరం లేకుండా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. కుత్బుల్లాపూర్ డీసీపీ గా ఉన్న శేషాద్రిని రెడ్డి..…

మేడారం వెళ్తున్నారా.. అయితే ఇటు లుక్ వేయండి

మేడారం వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 28, 29వ తేదీల్లో 28 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ టు మంచిర్యాల్, మంచిర్యాల్ టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ టు సికింద్రాబాద్, నిజామాబాద్ టు వరంగల్, వరంగల్ టు నిజామాబాద్,…

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 లకు ఫిబ్రవరి 3 లాస్ట్ డేట్

2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ద్వారా సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమాభివృద్ది సంస్థ తెలిపింది. ఫీచర్ ఫిలిమ్స్, జాతీయ సమైక్యతపై ఫీచర్ ఫిలిమ్స్, పర్యావరణం, హెరిటేజ్, చరిత్ర, సామాజిక చైతన్యం, బాలల…

కొండగట్టు దారిలో ఘోర రోడ్డు ప్రమాదం

హాస్పిటల్ లో బాధితులు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండగట్టుకు వెళ్లేదారిలో ఓ కెనాల్ లో క్వాలిస్ వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో అందులో ప్రయాణిస్తున్న 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన శివరాత్రి సురేష్,.. అతని కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం వేములవాడ దర్శనానికి…

మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ ల నియామకం

హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మున్సిపల్ ఎలక్షన్లలో ఘన విజయం సాధించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల…