Category ఫ్లాష్

మూడో అంతస్తు నుంచి కూలిన లిఫ్ట్

భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా ప్రజాపాలన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమం కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులు లిఫ్ట్‌లో వెళ్తున్నారు. అకస్మాత్తుగా లిఫ్ట్ కేబుల్ తెగిపోవడంతో మూడో అంతస్తు నుంచి కిందపడింది. ఈ ఘటనలో లిఫ్ట్‌లో ఉన్న ఆరుగురు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన భూపాలపల్లి వంద…

తెలంగాణకు మరో డిస్కం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న TGSPDCL, TGNPDCLలకు అదనంగా మూడో విద్యుత్ పంపిణీ సంస్థను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త సంస్థకు “తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGRPDCL)” అనే పేరు పెట్టింది. ఈ సంస్థను “రైతు డిస్కమ్” అని కూడా పిలుస్తారు.రైతు డిస్కమ్…

లవర్ తన మాట వినలేదని..

మహబూబాబాద్ : పెళ్లి విషయంలో ప్రేమజంట వాగ్వాదం చేసుకున్నారు. తన మాట నెగ్గలేదని ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన పెయింటర్ వల్లపునేని శశికుమార్ (21), కేసముద్రం శివారు తండాలోని ఇంటర్ యువతి (20) ఒకరినొకరు ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు.శశికుమార్ యువతికి ఫోన్…

50వేలకు శిశువు విక్రయం

మెదక్: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం లింగాసన్ పల్లి తండాకు చెందిన గర్భిణి మహిళ గత నెల 10వ తేదీన మెదక్ పట్టణంలోని ఎంసీహెచ్ లో ప్రసవించింది. మూడు రోజుల తరువాత ఆమెను డిశ్చార్జ్ చేయగా, తన స్వగ్రామమైన లింగాసన్ పల్లి తండాకు వెళ్లింది. ఈ నెల 4వ తేదీ నుంచి ఆమెకు పుట్టిన…

మార్కెట్ లోకి రంగురంగుల పత్తి

నాగపూర్ : Indian Council of Agricultural Research(ఐకార్) కు చెందిన శాస్త్రవేత్తలు నాగ్‌పూర్లో సహజంగానే రంగులతో పెరిగే కొత్త పత్తి రకాలను అభివృద్ధి చేశారు. ఈ పత్తి మొక్కలు సహజంగా గోధుమ , పచ్చ రంగుల్లో పండే విధంగా రూపొందించారు. వస్త్ర పరిశ్రమలో ఉపయోగించే రసాయన రంగుల అవసరాన్ని తగ్గించడమే ఈ కొత్త రకం…

ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం

వరంగల్ : వరంగల్ నగరంలోని జేపీఎన్ రోడ్డుపై ఉన్న దత్తాత్రేయ ఫర్నిచర్ షాపులో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికి ఆహుతైన ఫర్నిచర్ సామగ్రి కారణంగా భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. స్థానికులు గమనించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. షాపులో ఉన్న…

ఎమ్మార్వో ఇంటిపై ఏసీబీ దాడులు

కరీంనగర్ : సిద్ధిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ శ్రవణ్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. కరీంనగర్ లోని మహారాజా బార్ వెనకాల ఉన్న ఒక ఇంట్లో, ఆర్టీసీ కాలనీలో మరో ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్ గా పని చేసిన సమయంలోనూ బొమ్మకల్ భూముల విషయంలో పెద్ద…

ఇంట్లోంచి వెళ్లిన 5 నిమిషాలకే..

కరీంనగర్ : చొప్పదండి మండలం చాకుంట ఎక్స్ రోడ్డులో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను లారీ వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన తాటికొండ సాయికిరణ్(23), చిలుక ప్రదీప్(23) ఇద్దరు చాకుంటలో జరుగుతున్న వివాహానికి వారి రుక్మాపూర్ గ్రామం నుంచి బైక్ పై వెళ్లుతున్నారు.…

లవర్ కోసం సొంతింట్లో దొంగతనం

సిరిసిల్ల : తల్లి బంగారాన్ని అమ్మి ఇన్‌స్టాగ్రామ్ ప్రియుడికి ఖరీదైన బైక్ కొనిచ్చింది ఓ యువతి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతనిది ఎల్లారెడ్డిపేట మండలం, రాచర్ల గొల్లపల్లికి గ్రామానికి చెందిన యువకుడు. ఆ ప్రియుడు తనకు ఖరీదైన బైక్ కొని ఇవ్వాలని డిమాండ్…

నాగచైతన్యకు తప్పిన ప్రమాదం

హైదరాబాద్ : నాగచైతన్య‌కు తప్పిన ప్రమాదం తప్పింది. హైదరాబాద్ ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో జరిగిన ‘వృషకర్మ’ ఈవెంట్‌లో హీరో నాగచైతన్యకు ప్రమాదం తప్పింది. స్టేజీపై ఆయన కూర్చున్న కుర్చీ అకస్మాత్తుగా వెనక్కి విరిగిపోగా, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పట్టుకోవడంతో గాయాలు కాలేదు. ఈ ఘటనతో కంగారుపడిన అభిమానులను చూసి, చైతన్య చిరునవ్వుతో ‘తాను బాగున్నానంటూ’ సైగ చేసి…