Category ఫ్లాష్

కేసీఆర్ కు సిట్ నోటీసులు

హైదరాబాద్ : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. కేసీఆర్‌కు నోటీసులు సిట్‌ అధికారులు ఇవ్వనున్నారు. నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ కు బయలుదేరినట్లు అధికార వర్గాల సమాచారం. రేపు సిట్‌ హైదరాబాద్ లో కేసీఆర్‌ను విచారించనున్నట్లు సమాచారం.

జనవరి 30న సెలవు

మేడారం : శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా జనవరి 30, 2026 (శుక్రవారం) ములుగు జిల్లాలో స్థానిక సెలవుగా ప్రకటించారు. మేడారం గ్రామంలో జరిగే జాతరలో గద్దెలపై దేవతలు కొలువూ ఉండటం, భక్తుల పెద్ద సంఖ్యలో రాకపోకలు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ దివాకర టి.ఎస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ…

అవినీతిమయం చేసిన ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల :జగిత్యాల మున్సిపాలిటీపై ఎమ్మెల్యే సంజయ్ భ్రష్టు పట్టించారని, జగిత్యాల మున్సిపాలిటీని అవినీతికి కేంద్రంగా మార్చారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ,ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఏసీబీ దాడులు, విజిలెన్స్ విచారణలే అభివృద్ధికి నిదర్శనమన్నారు. ఛైర్ పర్సన్ సీటు ఖాళీ అయినప్పుడు చట్టంలో లొసుగులు ఉపయోగించి బలహీన వర్గాల హక్కులు కాజేశారని ఆరోపించారు.…

సాయంత్రం 6 గంటలకు సారలమ్మ రాక

మేడారం : వన దేవతల జాతర సందర్బంగా… మేడారం కి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.మహా ఘట్టంలోని మొదటి ఘట్టం… ఈరోజు సాయంత్రం కన్నెపల్లి నుండి సారాలమ్మ గద్దె కి రానుంది. ఈ నేపథ్యంలో అటు పూజారులు… ఇటు వివిధ శాఖల అధికారులు తగు ఏర్పాట్లు చేసారు. గద్దెల వద్ద ఎత్తు బంగారం ఇచ్చేందుకు దేవాదాయ…

మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా

హైదారాబాద్ :మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. 116 మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి.. 13న ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆప్ కండక్ట అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం…

ఎమ్మార్వో కొడుకు గవర్నమెంట్ స్కూళ్లో..

జనగామ పాలకుర్తి మండల ఎమ్మార్వో సరస్వతి తన కుమారుడిని, మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, జీతం తీసుకోవడమే కాదు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా…

యాక్సిడెంట్ లో యువ డాక్టర్ మృతి

doctor

హనుమకొండ వరంగల్ హంటర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న డాక్టర్ మమత (33)ను లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు ఫాదర్ ఆఫ్ కొలంబియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, 9 నెలల గర్భిణీగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తలకిందులుగా జాతీయ జెండా

దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను తలకిందులుగా ఎగరేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. గణతంత్ర దినోత్సవం వంటి పవిత్ర సందర్భంలో జాతీయ జెండాను సరైన విధంగా ఎగరవేయకపోవడం దేశ గౌరవానికి విఘాతం కలిగించిందని పలువురు విమర్శిస్తున్నారు. రాజ్యాంగ విలువలు, దేశభక్తి ప్రతీక అయిన త్రివర్ణ పతాకానికి ఈ…

సర్పంచిపై ఎస్ఐకి ఫిర్యాదు

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామ సర్పంచి ఎడవెల్లి వనజపై మాజీ సర్పంచి కర్ర సత్య ప్రసన్న రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటి ముందు నుంచి కారు వెళ్లకుండ కావాలనే జెండా గద్దె నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాత జెండా గద్దె వేరే చోటులో ఉన్నా.. కావాలనే…

ఐఏఎస్ కు ఘన సన్మానం

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 16 మంది అడిషనల్ కలెక్టర్లకు ‘ఐఏఎస్’ (IAS) హోదా కన్ఫర్మ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కరీంనగర్ జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గతంలో కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా పనిచేసి, ప్రస్తుతం మహాత్మా జ్యోతిబా ఫూలే విద్యాలయాల సంస్థ సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌కు ఐఏఎస్…